Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు మూడు నోటిఫికేషన్లు

నేడు మూడు నోటిఫికేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు టిజిపిఎస్‌సి శుభవార్త చెప్పింది. ఇప్పటి నుంచి ప్రతి నెలా 2, 3 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భం గా మంగళవారం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ నెలలో మొ త్తంగా 5 నుంచి 6 నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయం లో సోమవారం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియా సమావేశం నిర్వహిం చి నోటిఫికేషన్లు, పరీక్షల సంస్కరణలకు సంబంధించిన వివరాలు వెల్లడించా రు.34 శాఖలకు చెం దిన 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిందని.. ఇందులో 1,393 ఫా రెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉ న్నాయని తెలిపారు. ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉందని, ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని అన్నారు. పరీక్షల ని ర్వహణలో అనేక సంస్కరణలు తెస్తున్నామని వెల్లడించారు.

అన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే ఎక్కు వ మంది రాస్తారని, ఒక్కో జోన్‌కు ఒక్కోసారి పరీ క్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఒక్క జోన్‌లో పరీక్ష రాసినవారు మరో జోన్‌లో పరీక్ష రాసే అవకాశం ఉండదు అని స్పష్టం చేశా రు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణ దిశగా వె ళ్తున్నామని చెప్పారు. ఈ విధానంలో పరీక్షల నిర్వహణ ఉత్తమమైందని తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందు కూడా ప్రశ్నాపత్రం తయారు చేయవచ్చని అన్నారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలకు అదేరోజు లేదా ఒక రోజు ముం దు ప్రశ్నాపత్రం రూపొందిస్తామని తెలిపారు. కం ప్యూటర్ బేస్డ్ విధానంలో మార్కులు వెంటనే తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహణ చాలా క్లిష్టమైందని పేర్కొన్నారు. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని.. సాధ్యమైనంత వరకూ పరీక్షలు ఈ విధానంలోనే ఉంటాయని స్ప ష్టం చేశారు. ఇకపై 2, 3 నెలలకోసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తామని టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నామన్నారు.

ఉద్యోగాలు వచ్చిన వారి కంటే రాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని.. అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమది చాలా క్లిష్టమైన ఉద్యోగం అని, అందరినీ మెప్పించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. టిజిపిఎస్‌సిపై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారన్నారు. ఎంత ప్రయత్నం చేసినా అందరికీ ఉద్యో గం ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. టిజిపిఎస్ సి నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అసిస్టెం ట్ సైంటిస్ట్‌కు నోటిఫికేషన్ ఇచ్చామని, దాదాపు 19 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఉన్న పోస్టులు మాత్రం 20 అని చెప్పారు. తాను ఏం చేసినా కూడా 0.1శాతం నిరుద్యోగులకు మాత్ర మే ఉద్యోగాలు ఇవ్వగలను అని, 99.9శాతం మందికి నేను ఉద్యోగం ఇవ్వలేనని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu