Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు నైకా, రేపు ఫినో బ్యాంక్ ఐపిఒ

నేడు నైకా, రేపు ఫినో బ్యాంక్ ఐపిఒ

న్యూఢిల్లీ : నేడు నైకా ఐపిఒ ప్రారంభం కాగా, రేపు ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) మొదలు కానుంది.

దేశీయ ఇకామర్స్ కంపెనీ నైకా ఐపిఒ నేడు (గురువారం) ప్రారంభమైంది. ఒమ్నిచానెల్ బ్యూటీ ప్రొడక్ట్ రిటైలర్ ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.5,352 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ ధర శ్రేణి రూ. 1,085- నుంచి రూ.1,125 మధ్య నిర్ణయించారు. ఇన్వెస్టర్లు 12 షేర్ల లాట్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఐపిఒ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగుస్తుంది. కంపెనీ విలువను రూ.53 వేల కోట్లుగా నిర్ధారించారు. మరోవైపు ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఐపిఒ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. రూ.1200 కోట్ల డిజిటల్ బ్యాంకింగ్ కంపెనీ ఫినో ఐపిఒను ధర శ్రేణి రూ.560 నుంచి రూ.577 మధ్య నిర్ణయించారు. ఈ ఇష్యూ నవంబర్ 2న ముగియనుంది.

1న పిబి ఫిన్‌టెక్ ఐపిఒ
ఆన్‌లైన్ బీమా, రుణ సంస్థ పిబి ఫిన్‌టెక్ లిమిటెడ్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) నవంబర్ 1న ప్రారంభం కానుంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఈ ఇష్యూ ధర శ్రేణి రూ.940980 మధ్య ఉంది. కనీసం 15 ఈక్విటీ షేర్లతో బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను నవంబర్ 03న ముగుస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా 3750 కోట్ల రూపాయల విలువచేసే ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

దీపావళి తర్వాత పేటీఎం ఐపిఒ
వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) దీపావళి తర్వాత నవంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ ఐపిఒ ముగింపు నవంబర్ 10గా నిర్ణయించారు. ఈ ఐపిఒ ధర శ్రేణి రూ.2,150 నుంచి రూ.2,080 మధ్య నిర్ణయించారు. ఈ భారీ ఐపిఒను మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జెపి మోర్గాన్, సిటి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు నిర్వహిస్తున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపిఒ, అయితే గతంలో రూ.15,745 కోట్ల సమీకరణ లక్షంగా వచ్చిన కోల్ ఇండియా ఐపిఒ ముందు వరుసలో ఉంది.

Fino payments bank IPO to open on oct 29

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu