నేపాల్‌లో సంభవించిన వరదలో ఎల్‌బినగర్‌కు చెందిన ఓ మహిళ గల్లంతైంది.ఈ విషయం తెలుసుకున్న వాస్తునగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే ...
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తికి చెందిన కందిమళ్ల మహేందర్‌రెడ్డి, ప్రేమలత దంపతులు ఎల్బీనగర్ వాస్తునగర్‌లో నివాసం ఉంటున్నారు. మహేందర్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, అబ్బాయి ఉన్నారు. మోహన్‌రెడ్డి కూతురు సహాసినిరెడ్డికి నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడంపూర్‌కు చెందిన సంజీవ్‌రెడ్డితో 2004 విహాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూజిలాండ్‌కు వెళ్లి భార్యభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా సిటిజన్ షిప్ పొందారు. అనంతరం ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా దేశానికి వెళ్లారు.
ఈ నెల 19న హైదరాబాద్‌లో ఇంటి గృహ ప్రవేశానికి సుహాసిని రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. గృహ ప్రవేశం అనంతరం నేపాల్ మానస సరోవర్ యాత్రకు తరలివెళ్లింది. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు అక్కడి నుంచి ఖట్మాండ్ వెళ్లింది. ఇండియాకు చెందిన ఆస్ట్రేలియాలో నివాసముంటున్న మరో స్నేహితురాలిని ఖట్మాండ్‌లో ఒక దగ్గర కలుసుకున్నారు. సహాసినిరెడ్డి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టమని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సహాసినిరెడ్డి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో చెందారు. ఎన్నో రకాల ప్రయత్నం చేసిన సమాచారం లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం మానస సరోవర యాత్రికుల వివరాలు సమాచారం చెప్పాలని, యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

