Dailyhunt
నిజామాబాద్‌లో పోలీస్ స్టేషన్ పైనుంచి దూకిన యువతి

నిజామాబాద్‌లో పోలీస్ స్టేషన్ పైనుంచి దూకిన యువతి

నిజామాబాద్: ఓ యువతి పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

బాల్కొండకు చెందిన ఓ యువతి, సాయికుమార్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అప్పటికే సాయి కుమార్ పెళ్లైన విషయం యువతికి చెప్పలేదు. సాయి కుమార్‌కు వివాహం జరిగిన విషయం తెలియడంతో యువతి మోసాపోయానని గ్రహించింది. తీవ్ర మనోవేధనకు గురైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసి అనంతరం పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి కిందకు దూకింది. యువతి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. యువతిని పోలీస్ స్టేషన్ పైకి ఎలా వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu