ఒప్పో సంస్థ కొత్తగా కె14 ప్లస్ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 29,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో రూ. 25,999 కే లభిస్తుంది.
దీనిలో 8000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, ప్రాసెసర్, కూలింగ్ వ్యవస్థ ఉన్నాయి. వినియోగదారుల రోజువారీ అవసరాలకు తగినట్లుగా సాంకేతికతతో ఈ పరికరాన్ని నిర్మించామని కంపెనీ ప్రతినిధి గోల్డీ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ నెల 8 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

