Aadi Saikumar
హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఎస్ఐ యుగంధర్'. రాఘవేంద్ర కటారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించారు.
ప్రదీప్ జూలూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
ఈ మూవీలో అనుకోని పరిస్థితుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మృతదేహం మిస్ అవ్వడంతో దర్యాప్తు మొదలవుతుంది. ఈ క్రమంలో ఇదంతా ఒక సైకో పన్నిన కుట్ర అని తేలుతుంది. ఏంటా కుట్ర అనేది చిత్ర కథ.

