Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒటిటిలోకి వచ్చేస్తున్న 'సింగ్ గీతం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఒటిటిలోకి వచ్చేస్తున్న 'సింగ్ గీతం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sing Geetham

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం 'సింగ్ గీతం'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు.

అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించారు. గత నెల 11న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఒటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. విజయ్ దేవరకొండ, కెవి అనుదీప్, రాహుల్ రవీంద్ర, నివేద పేతురాజ్‌లు అతిథి పాత్రల్లో నటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu