Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు: వసీం అక్రమ్

పాక్ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు: వసీం అక్రమ్

పాకిస్థాన్ క్రికెట్‌పై ఆ దేశ మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొన్న ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ స్వదేశం కోసం పని చేయాలంటే భయం కలిగేలా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యాపాక్ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు: వసీం అక్రమ్నించారు.

తాజాగా మరో మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా పాక్ క్రికెట్‌పై విరుచుకుపడ్డారు. బయట నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా.. పాక్ క్రికెట్‌కు సాయం చేయలేనని కుండబద్దలు కొడ్డారు. దానకి కారణం కూడా చెప్పారు.

''పాకిస్థాన్‌ జట్టులోని కొందరు ఆటగాళ్ల ధోరణి ఈ సమస్యలను మరంత పెంచుతోంది. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు అవసరం అనే చందంగా.. మా దేశ క్రికెట్ బాగుపడాలంటే., బోరు, ప్లేయర్ల సహకారం కావాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందే పాక్ 3-0 తేడాతో ఓడిపోతుందని నాకు తెలుసు. ఇప్పటికే రెండు టెస్టులూ ఓడింది. మూడో దాంట్లోనూ మాకు పరాభవం తప్పదు. మా బ్యాటింగ్‌ ఇబ్బంది పడుతోంది. బౌలింగ్‌ తీరు అనుకున్నంత మేర లేదు. ఒక ఫీల్డింగ్ అత్యంత దారణం. అందుకే మా జట్టు ఓడిపోతుందని ముందే అంచనా వేయడానికి రాకెట్ సైన్స్ థియరీ అవసరం లేదు'' అని అక్రమ్ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu