Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులు

పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులు

న తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పది కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.

మూస పద్ధతికి స్వస్తి చె ప్పి, ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణం గా ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంటర్‌ప్రీనర్‌షిప్(సిఐఇ)తో సాంకేతిక విద్యాశాఖ కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, సిఇఇ ప్రతినిధులు శేఖర్‌రెడ్డి, శ్రీ కాంత్‌లతో కలిసి కమిషనర్ శ్రీదేవసేన మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సుల వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్షరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్స్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ ల్యాండ్‌స్కేప్ డిజైన్, డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న కొన్ని కోర్సులకు పేర్లను మార్చడంతోపాటు అన్ని కోర్సుల సిలబస్‌ను ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు. చదువు పూర్తయి పట్టాతో కళాశాల నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఉపాధి లభించాలన్న సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కోర్సులకు రూపకల్పన చేశామని అన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లో కోర్సులు

రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిషిప్ ఎంబేడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఎఇడిపి) కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈసారి కొత్తగా 5 వేల ఎఇడిపి సీట్లు అందుబాటులోకి రాగా, మొత్తం 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డిగ్రీ చదువుతూనే అప్రెంటిషిప్ చేస్తూ పని నేర్చుకోవచ్చని, అప్రెంటిషన్‌లో సమయంలోనే విద్యార్థులకు స్టైఫండ్ కూడా లభిస్తుందని వివరించారు. ఈ కోర్సుల ద్వారా డిగ్రీ చదువుతున్న సమయంలోనే పరిశ్రమలు, సంస్థలు, సేవా రంగాలలో ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి వచ్చిన ఎఇడిపి కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోందని, దోస్త్ మొదటి విడతలో 49.6 శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. కేవలం న్యాక్ అక్రిడియేషన్ ఉన్న ప్రభుత్వ కాలేజీలకే ఎఇడిపి కోర్సులకు అనుమతి లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులో ఉన్న ఎఇడిపి కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులు

1. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ మానుఫాక్షరింగ్ టెక్నాలజీ(ఎఎంటి)

2. డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్(ఎఎంఇ)

3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్(ఎఆర్)

4. డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్స్ టెక్నాలజీ(ఎస్‌సిటి)

5. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్(సిఇబిఎస్)

6. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్(సిఇఆర్‌వి)

7. డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(సిటిఎం)

8. డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్(ఐడి)

9. డిప్లొమా ఇన్ ల్యాండ్‌స్కేప్ డిజైన్(ఎల్‌డి)

10. డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ (బిటి)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu