Dailyhunt
పన్ను ఎగవేత కట్టడికి రేవన్ పోర్టల్

పన్ను ఎగవేత కట్టడికి రేవన్ పోర్టల్

న తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో డిజిటల్ సంస్కరణలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యూనిఫైడ్ రెవె న్యూ పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు స్టీరింగ్ కమిటీని నియమించింది.

పన్నుల ఎగవేతను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. సిఎస్ నేతృత్వంలోని రెవెన్యూ శాఖ విభాగాల కార్యదర్శులతో ఈ అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆదాయం తెచ్చే శాఖలను కలిపి 'రెవన్' పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖల మధ్య డేటా మార్పిడి, పోర్టల్ రూపకల్పనపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. స్థానిక సంస్థలు, వినోదపు పన్ను వసూళ్లు, యూ పిఐ, పిఓఎస్ లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం ఏర్పాటు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఈ క మిటీని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జిఓ 81ని ప్రభుత్వ తరువాయి 9లో

మొదటిపేజీ తరువాయి

ఏరియా అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రవాణా అండ్ బిల్డింగ్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీల ప్రిన్సిపల్ సెక్రటరీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక శాఖ సెక్రటరీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ, లేజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ నుంచి న్యాయ శాఖ సెక్రటరీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

కన్సల్టెంట్ల ఖర్చును భరించనున్న కమర్షియల్ టాక్స్ శాఖ

ఈ స్టీరింగ్ కమిటీ సాష్ట్‌వేర్ వెండర్ ఎంపిక, డేటా భద్రత, ప్రైవసీని పరిశీలించనుంది. దీంతోపాటు పోర్టల్ గో-లైవ్ కోసం టైమ్‌లైన్ సిద్ధం చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ అమలుపై అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అవసరమైతే నిపుణుల కన్సల్టెంట్‌లను నియమించుకునే అధికారాన్ని కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది. కన్సల్టెంట్ల ఖర్చును కమర్షియల్ టాక్స్ శాఖ భరించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu