Dailyhunt
పవన్‌ మాజీ భార్యపై అసభ్య కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్

పవన్‌ మాజీ భార్యపై అసభ్య కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్

Renu Desai

అంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌పై సోషల్ మీడియలె అసభ్యకర కామెంట్లు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్‌ా ఉంటారు.

తన గురించి.. తన పిల్లల గురించి.. పలు సామాజిక అంశాల గురించి ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే పలు సందర్భాల్లో ఆమెపై ట్ర్రోల్స్, అసభ్యకర కామెంట్లు వస్తుంటాయి.

తాజాగా రేణు దేశాయ్‌పై అసభ్యకర సపదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా రేణు దేశాయ్ వెల్లడించారెు. పోలీసులకు ఆమె కృతజ్ఙతలు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ వీధి కుక్కల గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె మండిపడ్డారు. 100 కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని.. మిగితా 90 కుక్కలు మంచివి ఉంటాయని పేర్కొన్నారు. ఆ 10 కుక్కల కోసం మిగితా 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu