Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

న్యూఢిల్లీ: ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. బుధవారం (సెప్టెంబర్ 9) ఉదయం 11.55 గంటలకు ఢిల్లీలోని ఓఖ్లా ఫేజ్-1లో ఒక కమ్యూనిటీ హాల్ సమీపంలో ఆక్సిజన్ సిలిండర్ పేలింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

మృతుడిని జైపూర్‌కు చెందిన మోహిత్ సింగ్ (35)గా పోలీసులు గుర్తించారు. ఎస్ఎం ట్రేడర్స్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న సింగ్, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సుమారు మూడేళ్లుగా ఆ సంస్థలో సింగ్ పనిచేస్తున్నాడు. ఇక, గాయపడిన వారిని ఉమేష్, అరవింద్, మనోజ్, పంకజ్‌గా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu