Current Bill
ములుగు: పెంకుటింట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి ఏకంగా దాదాపు లక్షన్నర కరెంటు బిల్లు వచ్చిన ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
తాము ఐదేళ్లుగా వేరే చోట కిరాయికి ఉండేవాళ్లమని, గత 8 నెలల నుంచే ఈ ఇంట్లో ఉంటున్నామని యజమాని కొమ్మినేని ప్రమీల తెలిపారు. అప్పటి నుంచి కరెంటు బిల్లు రాలేదని, గత నెల మొత్తం రూ.1,43,136 బిల్లు వచ్చిందన్నారు.తమ ఇంట్లో రెండు ఫ్యాన్లు, టివి, ఫ్రిడ్జితో పాటు మూడు ఎల్‌ఇడి బల్బులు మాత్రమే ఉన్నాయన్నారు. బిల్లు మొత్తం చెల్లించాలని అధికారులు ఒత్తి చేస్తున్నట్లు ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు.

