Dailyhunt
ప్రభుత్వ ఏర్పాటుకు టివికె అధినేత విజయ్‌కి గవర్నర్ ఆహ్వానం

ప్రభుత్వ ఏర్పాటుకు టివికె అధినేత విజయ్‌కి గవర్నర్ ఆహ్వానం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టివికె పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టివికె అధినేత విజయ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ అహ్వానం పంపించారు.

ఈ మేరకు ఆయనకు పంపిన అహ్వాన ప్రకటనను లోక్‌భవన్ విడుదల చేసింది. నేడు సాయంత్రం విజయ్, గవర్నర్‌ని కలవనున్నరు.

అయితే ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీజటన్లకు టివికెకి రాలేదు. దీంతో ఇతర పార్టీల మద్ధతు కోసం ఆ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. అయితే టివికె ఏ పార్టీతో ముందుకెళ్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో మరో రెండు మెజారిటీ నిరూపించుకుంటామని టివికె పార్టీ ఇప్పటికే గవర్నర్‌ని కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu