Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు రెడీ

ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు రెడీ

స్థలం, సమయం, అంశాలు సిఎం నిర్ణయించాలి: కెటిఆర్

నతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి స్వయంగా సమయం, స్థలం నిర్ణయించి చెబితే చర్చకు వస్తానని కెటిఆర్ అన్నారు. నా సవాల్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ పెట్టిన వరంగల్‌లో కావచ్చు, లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని రాహుల్ గాంధీని మోసం చేసిన అశోక్‌నగర్ ఎక్కడైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని కెటిఆర్ అన్నారు.

సమయం, ప్లేసు, టాఫిక్ రేవంత్ రెడ్డి డిసైడ్ చేసి చెప్పాలని, అక్కడకు వచ్చి గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాన్ని, రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టకుంటే అక్కడే రాజీనామా పత్రం ఇచ్చి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సవాల్‌కు సిద్ధమా రేవంత్‌రెడ్డి అని కెటిఆర్ ప్రశ్నించారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పారిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటేనని కెటిఆర్ అన్నారు. ఒకసారి సవాల్ అని చెప్పి వెంటనే మాట మార్చి పారిపోవడం రేవంత్‌రెడ్డికి అలవాటైందని కెటిఆర్ అన్నారు. సిఎం, అయన కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లే తెలంగాణ దివాళ తీస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ఎంత దివాలాకోరు మనిషి అయినా, తాను దివాలా తీశానని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరగడని, కానీ, రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణ గురించి అలాగే మాట్లాడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.

72 సార్లు సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి

ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, మరీ 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి వెళ్లింది ఎవరిని బ్రతిమాలుకోవడానికి ప్రజలకు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రెండున్నర సంవత్సరాల పాటు ఇక ఢిల్లీకి వెళ్లకుండా తెలంగాణలోనే ఉండి పరిపాలన చేసి తన నిబద్ధత చాటుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదనీ కెటిఆర్ అన్నారు. ఒకనాడు దాశరథి అన్నట్లు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అయితే, కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యిందని కెటిఆర్ పేర్కొన్నారు.

పంటలు, ఆదాయం, సాగునీరు అన్నీ రెట్టింపుకు మించి అభివృద్ధి సాధించాయన్నారు. అయినా ఇంతటి ధనిక రాష్ట్రాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్రం సహకరించకున్నా అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయామన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకున్నా, ఒక్క రూపాయి అదనంగా ఇవ్వకున్నా అద్భుతమైన ప్రగతి పథంలో తీసుకుపోయామని కెటిఆర్ తెలిపారు.

కాంగ్రెస్ అవినీతి, దోపిడీ వల్ల, లూటీ వల్లే రాష్ట్రం దివాళ

ఒకవేళ రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా తెలంగాణ దివాలా తీయాల్సి వస్తే, కచ్చితంగా అది ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు తన మంత్రివర్గ సహచరులు చేస్తున్న అవినీతి, దోపిడీ వల్ల, లూటీ వల్లనేనని కెటిఆర్ ఆరోపించారు. అన్ని తప్పుడు లెక్కలు దొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక్క రాష్ట్ర రైతాంగానికే లక్ష 13 వేల కోట్ల రూపాయల కోట్లు ఎగ్గొట్టారని కెటిఆర్ ఆరోపించారు. ఇప్పటిదాకా ఎగ్గొట్టిన లక్షా పది వేల కోట్ల రూపాయల బాకీ ఎప్పుడు కడతావు అంటూ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తన స్థాయిని పెంచుకోవడానికే కెసిఆర్ గురించి రేవంత్ మాట్లాడుతున్నారు....

ఒకవైపు డబ్బులు లేవు అంటూనే రూ.200 కోట్లతో తన సొంత ఇష్టాల మేరకు ఒక రాజభవనం నిర్మించుకుంటు న్నారని కెటిఆర్ ఆరోపించారు. దానికి ఆయన సతీమణితో అర్ధరాత్రి పూజలు చేస్తున్నారని, ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు అర్ధరాత్రి దొంగ చాటుగా పూజలు నిర్వహించారో చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. కొడంగల్ తో పాటు జిహెచ్‌ఎంసిలోనూ బిఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి ఈ సారి తప్పకుంటానని మాట మార్చారని కెటిఆర్ అన్నారు. కేవలం కెసిఆర్‌తో కూర్చొని చర్చ చేస్తే తన స్థాయి పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే ప్రతిసారి రేవంత్ రెడ్డి కెసిఆర్ గురించి మాట్లాడుతూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu