Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజా పాలన కాదు.. దోపిడి పాలన: బిజెపి ఎంపి కె లక్ష్మణ్

ప్రజా పాలన కాదు.. దోపిడి పాలన: బిజెపి ఎంపి కె లక్ష్మణ్

రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. దోపిడి పాలన కొనసాగుతున్నదని బిజెపి ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లిందని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతాం, వారి వెంట ఉంటాం అన్నారు. రైతు భరోసా అరకొర ఇచ్చారని, నకిలీ విత్తనాలు, సకాలంలో యూరియా అందించక అభాసుపాలయ్యారని, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

ఉచిత వైద్యం పచ్చి బోగస్ అని తేలిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమైందన్నారు. నోటిఫికేషన్ అడిగితే లాఠీ చార్జి, ఉద్యోగాలు అడిగితే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తారని ఆయన తూర్పారపట్టారు. విదేశాలు తిరిగే ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీకి చిక్కడపల్లి లైబ్రరీ గుర్తు రావడం లేదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి చిక్కడపల్లి లైబ్రరీ వద్దకు రావాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu