Dailyhunt
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దిశగా బిజెపి అడుగు : రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దిశగా బిజెపి అడుగు : రాహుల్ గాంధీ

ఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసేందుకే బిజెపి వచ్చిందని, అసోం, పశ్చిమబెంగాల్ లో ప్రజల తీర్పును అపహరించారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇది కేవలం ఒక పార్టీనేత ఓటమి కాదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దిశగా బిజెపి అడుగు వేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లోని కొందరు టిఎంసిని ఓటమిని చూసి మురిసిపోతున్నారని, టిఎంసి ఓటమిపై కాంగ్రెస్ నేతల సంబరాల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండని, దేశ ప్రజాస్వామ్య మనుగడపై దృష్టి పెట్టండని రాహుల్ సూచించారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, ఇది దేశం అస్తిత్వానికి సంబంధించిన సమస్య అని తెలియజేశారు. విపక్షాల మధ్య అనైక్యత బిజెపికి వరంగా మారుతోందని, బెంగాల్, అసోం పరిణామాలు దేశ ప్రజాస్వామ్య వినాశనానికి సంకేతాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu