గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పెద్ది'. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా ఈవెంట్ శనివారం సాయంత్రం భోపాల్‌లో జరిగింది. అయితే చరణ్ ఈ ఈవెంట్‌లో తడబడ్డారు. వేదికపై మన క్రికెటర్ల గురించి ఒక్కమాటలో చెప్పాలంటూ హోస్ట్ ర్యాపిడ్‌ఫైర్ నిర్వహించారు. అయితే జస్ప్రీత్ బుమ్రాకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పిన చరణ్.. అతడిని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన క్లిప్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చరణ్ క్షమాపణ చెప్పారు.
''నేను కొన్నిసార్లు పేర్లను మర్చిపోతుంటాను. జనసందోహం, అక్కడ హంగామా మధ్య అనుకోకుండా పొరపాటు జరిగింది. జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు. ఆయన్ను నేను గౌరవిస్తాను. ఆయన ఆటకు నేను పెద్ద ఫ్యాన్. బ్యాటర్లు వెనకడుగు వేసేలా మీ నిలకడైన ఆటతీరు భారతీయులంతా గర్వపడేలా చేస్తోంది'' అని చరణ్ పేర్కొన్నారు. అయితే వేడుక జరిగిన ప్రాంతం విషయంలోనూ చరణ్ పొరపడ్డారు. భోపాల్‌కు బదులు బిహార్ అని ప్రస్తావించారు. అయితే, తన పొరపాటును వెంటనే గ్రహించారు.

