Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. జెసిబితో..

ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. జెసిబితో..

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య తన భర్తలు దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది.

గంగాపూర్‌కు చెందిన ముత్యంరెడ్డిని అతని భార్య.. ప్రియుడు చింటు సాయంతో హత్య చేసింది. ఆ తర్వాత జెసిబితో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారించడంతో 9 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu