Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

మరావతి: ప్రేమ వ్యవహారాలకు తల్లి అడ్డుగా ఉండడంతో ఆమెను కన్న కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....క్యాబిన్ పేటలో ఈవూరి లక్ష్మీ తన కూతురు పుష్పలతతో కలిసి ఉంటుంది. రాజా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కూతురు ప్రేమ వ్యవహారాలకు తల్లి అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని ప్రియుడితో ప్రణాళిక రంచించింది. గత అర్థరాత్రి ఈవూరి లక్ష్మీ అనుమానాస్పదంగా చనిపోవడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుష్పలత తన ప్రియుడితో కలిసి కూతురును హత్య చేసిందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పుష్పలతను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu