రోమ్: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్ పోటీల్లో స్వర్ణం సాధించాడు. 65 కిలోల విభాగం ఫైనల్లో భజరంగ్ మంగోలియా రెజ్లర్ తుల్గా తుమర్ ఒచిర్‌ను ఓడించాడు. ఒక దశలో 02తో వెనుకంజలో ఉన్న పునియా కీలక సమయంలో పుంజుకున్నారు. ఆఖరి 30 సెకన్లలో రెండు పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. నిబంధనల ప్రకారం ఆఖర్లో పాయింట్లు సాధించిన వారికే వితేతగాప్రకటిస్తారు. దీంతో ఆఖరి క్షణాల్లో పాయింట్లను సాధించిన పునియా తన ఖాతాలో స్వర్ణం వేసుకున్నాడు. ఇదే క్రమంలో 65 కిలోల విభాగంలో తిరిగి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
కరోనా వైరస్ కారణంగా భజరంగ్ ఏడాది పాటు రెజ్లింగ్‌కు దూరమయ్యాడు.

