నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "మేము, నవకాంత్, రియల్ సతీష్ ఈ సినిమాకు పనిచేశాం. ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశాం. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది.
దర్శకుడు శ్రీకాంత్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడలేదు. మాకు కూడా అది చాలా కొత్తగా అనిపించింది. -నాని ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి.
ఇందులో యాక్షన్ సీన్స్ చాలా భారీగా ఉంటా యి. 'దసరా' కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుంది. -జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే. మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. -మోహన్ బాబు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయనకూ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి"అని అన్నారు.

