Dailyhunt
రాజస్థాన్‌కు ఎదురుందా?

రాజస్థాన్‌కు ఎదురుందా?

నేడు ముంబైతో పోరు

గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న రాజస్థాన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

దీంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ముంబైలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ముంబై కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధహైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu