నితీశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన భారీ మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.
దాదాపు రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా దీన్ని నిర్మించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం 'రామాయణ: ది రైజ్ ఆఫ్ లెజెండ్' నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు నమిల్ మల్హోత్రా సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 137 నగరాలు, పట్టణాల్లో 4,339 షోలకు గానూ 1.81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయని, వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక భారీ విజువల్ హంగులతో తెరకెక్కిన 'రామాయణ'ను ఐమ్యాక్స్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆ థియేటర్లలో టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ముంబైలోని కొన్ని ఐమ్యాక్స్‌ల్లో రిక్లెయినర్ సీటు రూ.3,170 పలుకుతోంది. పివిఆర్ ఐకాన్: ఫీనిక్స్ పల్లాడియంలో ఉదయం 7 గంటల షోకు రిక్లెయినర్ సీటు ధర రూ.1,850గా ఉంది. ఇప్పటికే ఈ షో హౌస్‌ఫుల్ కావడం గమనార్హం. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఐమ్యాక్స్ త్రీడి వెర్షన్లకు వీటి ధర రూ.1,550-2,400 మధ్య ఉంది.

