Dailyhunt
తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇవాళ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, రాష్ట్రంలో గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా పంటలు తడిసి దెబ్బ తినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మంచు ముసురు కరుస్తూ వాతావరణం చల్లగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu