Dailyhunt
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అమలు కాని హామీలలో అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువునా ముంచారని అన్నారు.

సంగారెడ్డిలో బిఆర్ఎస్ లో చేరికలు కొనసాగాయి. హరీష్ రావు సమక్షంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి ఆరిఫ్ సహా 25 మంది చేరారు. గులాబీ కండువాలు కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుర్మార్గాలను చూడలేకే కాంగ్రెస్ పార్టీ వాళ్లు బిఆర్ఎస్ లో చేరుతున్నారని, జాబ్ క్యాలెండర్ లేదు, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అయ్యిందని, అవ్వాతాతలకు పెన్షన్లు పెంచలేదని మండిపడ్డారు. మహిళలకు రూ.2500 ఇవ్వలేదని, రైతన్నల హామీలు నెరవేర్చకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియాదే కీలకపాత్రని, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని హరీష్ రావు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu