హైదరాబాద్: ప్రతి ఒక్కరు సర్ మ్యాపింగ్ పై, సర్ మీడియాపై దృష్టి పెట్టాలని..ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులే లేరని అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక పార్టీ బిజెపినే అని పని చేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదని భట్టి తెలియజేశారు. అసెంబ్లీ, ఎంపి, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించామని, జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

