Dailyhunt
రంగారెడ్డిలో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య.... కుమారుడి శవం లభ్యం

రంగారెడ్డిలో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య.... కుమారుడి శవం లభ్యం

రంగారెడ్డి: కుమారుడు కనిపించడంలేదని తండ్రి బావిలో దూకి బలవన్మరణం చెందాడు. తండ్రి శవం కోసం గాలించగా అదే బావిలో బాలుడి మృతదేహం దొరికింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో జరిగింది.

సంతాపూర్ గ్రామంలో యాదయ్య, సరిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కన్నయ్య అనే కుమారుడు(11) ఉన్నాడు. శనివారం ఉదయం కన్నయ్య ఇంట్లో నుండి బయటకు వెళ్లి న కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామంతో పలువురు బంధువుల ఇండ్లలో వెతికారు.

ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశాడు. రెండు రోజులుగా తన కుమారుడు కనిపించడం లేదని బంధువుల దగ్గర బాధ పడి తీవ్ర మనస్తాపానికి తండ్రి గురయ్యాడు. తన పొలంలో ఉన్న బావిలో యాదయ్య దూకాడు. తండ్రి కోసం గాలిస్తుండగా కుమారుడి మృతదేహం దొరికింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. యాదయ్య బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu