కీవ్: రష్యాలో డీజిల్ ఇంధన కొరతకు కారణమవుతున్నందున.. ఆ దేశంలోని డీజిల్ నిల్వలు, సరఫరా కేంద్రాలపై దాడులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి సూచించారు.
రష్యాలోని ఇతర లక్ష్యాలపై దాడులు చేసుకోవచ్చని, డీజిల్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇటీవల మాట్లాడిన అనంతరం జెలెన్‌స్కీతో ట్రంప్ సంభాషించారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఐర్లాండ్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ జరుగుతున్న డూన్‌బెగ్ క్లబ్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. "జెలెన్‌స్కీ ఒక పని చేయాలి. రష్యాలో డీజిల్ ఇంధనాన్ని ధ్వంసం చేయడం ఆపాలి. ఇతర లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. కానీ డీజిల్‌ను మాత్రం లక్ష్యంగా చేసుకోవద్దు. ఎందుకంటే అక్కడ డీజిల్ కొరత ఏర్పడుతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

