జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌటైంది.
ఆ జట్టులో ఓపెనర్ బ్రయాన్ బెనెట్ (32) మాత్రమే రాణించాడు. మరుమాని (24), ర్యాన్ బర్ల్ (20), బ్రాడ్ ఎవాన్స్ (19), డియోన్ మైయర్స్ (12)లు పెద్దు స్కోరు చేయడంలో విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ లు చెరో వికెట్ తీయగా.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్, తిలక్ వర్మకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ 90 పరుగులు భారీ తేడాతో గెలుపొంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది.

