Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు రామమందిరం ట్రస్ట్ సీఈఓ ఎంపిక

రేపు రామమందిరం ట్రస్ట్ సీఈఓ ఎంపిక

Ram temple ground floor to be complete by December

అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎంపిక బుధవారం జరగనుంది.

ఇందుకోసం ఎంపిక కమిటీ రూపొందించిన ముగ్గురు సభ్యుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బుధవారం జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో సీఈఓతో పాటు ప్యానెల్‌లోని ఇద్దరు సభ్యులు, జనరల్ సెక్రటరీ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానుకల చోరీ జరిగిందన్న ఆరోపణలు, ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ నివాసమైన మణిరామ్‌దాస్ ఛావడీలో సమావేశం జరగనుంది. మరోవైపు ట్రస్ట్ తొలి కార్యదర్శిగా జగదీశ్ ఆఫ్లే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఆఫ్లే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu