Dailyhunt
రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన నిజాలు వెలుగులోకి

రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన నిజాలు వెలుగులోకి

హైదరాబాద్: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 25 మంది రిచ్ మైనర్ బాలికలను అర్జున్ అండ్ కో ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు దొరక్కుండా లీగల్ గా చాలా పగడ్బందీగా అర్జున్ అండ్ కో వ్యవహరించారు. తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల సెల్ ఫోన్ ల నుండి అమ్మాయిలను అన్నదమ్ములు అర్జున్, రాజీవ్ ట్రాప్ చేశారు. పోలీసులకు దొరికినా తన మీదకు రాకుండా స్నేహితుల ఇన్ స్టా గ్రామ్ లను వాడుకున్నారు. మైనర్లు ట్రాప్ అయ్యాక, వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి మైనర్లతో లైంగికంగా అర్జున్ పాల్గొన్నాడు. అలా 25 మంది మైనర్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అర్జున్ అండ్ రాజీవ్ డబ్బులు వసూలు చేశారు. ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మైనర్ అమ్మాయిల నుండి అన్నదమ్ములు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu