భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇంతకాలం మైదానంలో తన ఆటతో మనల్ని అలరించాడు. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతున్నాడు.
త్వరలో 'ఫామిలీ ఫుల్‌హౌస్ విత్ రోహిత్ శర్మ' అనే షో ద్వారా రోహిత్ టివి యాంకర్‌గా మారనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి బుల్లితెరపై ఈ ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఇందులో రోహిత్ శర్మ వైట్ కలర్ టీ షర్ట్ ధరించి కెమెరాతో మాట్లాడాడు. దానిపై (non-committal?) కమిట్‌మెంట్ లేదా? అని రాసి ఉంది. దీంతో నోటితో ఏమీ అనకపోయినా ఈ కోట్‌తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను రోహిత్ ట్రోల్ చేశాడని నెట్టింట అభిమానులు అనుకుంటున్నారు.
గతేడాది అక్టోబర్‌లో శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు రోహిత్, విరాట్ 2027 ప్రపంచకపక ఆడే విషయంలో కమిట్మెంట్‌తో లేరని (non-committal?) అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. దానికి ఫిబ్రవరిలోనే రోహిత్ ఓ కౌంటర్ ఇచ్చాడు. దేశం కోసం ట్రోఫీలు గెలవాలనే కమిట్మెంట్, ఆకలి తమకు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా అగార్కర్ ఉపయోగించిన పదాన్నే టీ షర్ట్‌పై ముద్రించుకొని రోహిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

