మన తెలంగాణ / రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన యుపిఐ డిజిటల్ చెల్లింపుల విధానం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రయాణీకుల నుండి ఊహించని స్పందన లభిస్తోంది.
చిల్లర సమస్యతో సతమతమయ్యే కండక్టర్లు ఊపిరిపీల్చుకునే పరిస్థితి నెలకొంది. ఆర్‌టిసి బస్సుల్లో డిజిటల్ చెల్లింపులతో ప్రయాణీకులు జేబులో డబ్బుల్లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యధేచ్చగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ డిజిటల్ చెల్లింపుల విధానం సంస్థ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ప్రారంభంలో చిన్న స్థాయిలో ఉన్న ఈ డిజిటల్ ప్రక్రియ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు కేవలం రూ 2 వేల లావాదేవీలతో మొదలైనా
ఇప్పడది ఏకంగా రూ. 2.5 కోట్ల మైలురాయిని దాటాయి గత 11 నెలల్లోనే 42.75 కోట్ల డిజిటల్ టికెట్లు జారీ అయినట్లు ఆర్‌టిసి అధికారులు తెలిపారు. దీంతో సంస్థ ఖాతాలో మొత్తం రూ.505.95 కోట్ల యూపిఐ నగదు జమ అయింది. ఇది ఆర్‌టిసిలో వచ్చిన డిజిటల్ మార్పు వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మార్చి 2025లో కేవలం 5.25 లక్షలుగా ఉన్న డిజిటల్ టికెట్ల సంఖ్య జూన్ 2026 నాటికి ఏకంగా 64.17 లక్షలకు చేరింది. ఇది సుమారు 1122.29 శాతం వధ్ది అని అధికారులు తెలిపారు. ఆదాయంలో వృద్ధిని పరిశీలిస్తే యూపిఐ చెల్లింపులు ప్రారంభమైన తొలినాళ్లలో ఆదాయం రూ. 5.41 కోట్లు నమోదు కాగా జనవరి 2026 నాటికి అది ఏకంగా రూ. 73.90 కోట్లకు చేరి 1265.99 శాతం అభివృద్ధి సాధించినంది.ఆదాయం సుమారు 13 రెట్లు పెరగడం విశేషం.

