Dailyhunt
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో... వెలుగులోకి సంచలన విషయాలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో... వెలుగులోకి సంచలన విషయాలు

నతెలంగాణ, సిటిబ్యూరోః సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటికి రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి. తన భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సీతారాం నోట్ ద్వారా వెల్లడించాడు. ఇలాంటి సంబంధాలు వద్దని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని సీతారాం పేర్కొన్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

సీతారాం భార్య, పిల్లలతో కలిసి బాచుపల్లిలో స్థిరపడ్డారు. అయితే రేణుక తన భర్తకు తెలియకుండా ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుక రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సీతారాంకు భార్య నిజ స్వరూపం తెలిసింది. ఆ దారుణాలు చూడలేక భర్త సీతారం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రేణుక నమ్మకద్రోహంచేయడం వల్లే నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు తీసుకున్నాడని, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబసభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.

సూసైడ్ లేఖలో....

సూసైడ్ లేఖలో 'నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలను, అసలు రేణుకకు ఏం కావాలి. ప్రేమనా లేక శృంగారమా..? నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసి' బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు రేణుకతోపాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu