Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప్ నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ నారా పుట్టినరోజు సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'కపాలి' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోహిత్ నారా ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కనిపిస్తున్నారు. కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్లు పోస్టర్‌లో చూపించారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేలా ఆకట్టుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu