Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంగారెడ్డిలో ఇషా గ్రామోత్సవం

సంగారెడ్డిలో ఇషా గ్రామోత్సవం

షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.

వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడల్లో అనేక గ్రామాల జట్లు పోటీపడి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే ఇషా గ్రామోత్సవం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు విశేష కృషితో పోటీల నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఈ ఏడాది గ్రామోత్సవంలో తొలిసారిగా మహిళల జట్టు పాల్గొనడం విశేషమన్నారు. అత్యంత ఉత్సాహం, పట్టుదలతో పోటీపడిన ఆ జట్టు రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుందని తెలిపారు. వారి విజయం గ్రామీణ మహిళలు, యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు కొనియాడారు.***

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu