Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం

సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం

KKR vs SRH

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని కెకెఆర్ 18.2 ఓవర్లలో ఛేదించింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో రఘువంశీ 59 పరుగులతో అద్భుతంగా రాణించగా.. కెప్టెన్ రహానే 43, అలెన్ 29, రింకు 22 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. దీంతో కెకెఆర్ పది బంతులు మిగిలి ఉండగానే 169 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu