Harmanpreet Kaur, Deepti Sharma
వడోదర: జింబాబ్వే మహిళ జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మలు చెలరేగిపోయారు.
ఇద్దరు సెంచరీలు సాధించారు. హర్మన్‌ప్రీత్ 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేయగా, దీప్తి శర్మ 86 బంతుల్లో 15 ఫోర్లతో 106* చేసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.
ఇక భారత్ బ్యాటింగ్‌లో ప్రతీక రావల్ (61) అర్థ శతకం సాధించింది. మిగితా బ్యాటర్లు స్మృతి మంధాన (0), షెఫాలీ వర్మ (8), తేజల్ హసాబిన్స్ (3), రిచా ఘోష్ (7) స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. జింబాబ్వే బౌలర్లలో నొమ్వెలో సిబంద 2 వికెట్లు తీయగా, మకుషా, మిచెల్లె మవుంగా, న్యాషా, ఒలిండర్ తలో వికెట్ తీశారు.

