Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సేవ్ ది టైగర్స్' సీజన్‌-3 వచ్చేస్తోంది.. ఈసారి మూడింతల నవ్వులతో

'సేవ్ ది టైగర్స్' సీజన్‌-3 వచ్చేస్తోంది.. ఈసారి మూడింతల నవ్వులతో

Save The Tigers

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వెబ్‌సిరీస్‌లలో 'సేవ్ ది టైగర్స్' ఒకటి. ఇప్పటివరకూ వచ్చిన రెండు సీజన్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.

ముగ్గురు జంటల చుట్టు సాగే ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ప్రియదర్శి-సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డిలు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సిరీస్ మూడో సీజన్ వచ్చేందుకు సిద్ధమవుతోంది.

దీనికి మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్. ఈ సీజన్‌లో మరిన్ని ఆసక్తికర ట్విస్టులు, కొత్త పాత్రలతో అలరించేందుకు సన్నద్దమవుతోంది. ఈ సీజన్‌లో వెన్నల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సీజన్‌లో నవ్వులు మూడింతలు ఉంటాయని తెలుస్తోంది. తాజాగా 'సేవ్‌ ది టైగర్స్ సీజన్ 3'కి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే కథలో కాస్మిక్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూడో సీజన్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu