Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్‌లో హోటల్ లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి

శంషాబాద్‌లో హోటల్ లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి

Road accident in Medchal district: Three killed

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కంటైనర్‌ను బస్సు తప్పించబోయి హోటల్‌లోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. హోటల్‌లో ఓ వ్యక్తి టీ తాగుతుండగా అతడిని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

జిహెచ్ఎంసి పరిధిలోనికి వచ్చిన తరువాత బస్సులు స్పీడ్ తగ్గించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అతివేగంగా నడిపే వాహనాలపై చలాన్లు విధిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వాహనాదారుల్లో మార్పు మాత్రం కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu