హోమ్
శశికళకు జైలు నుంచి విముక్తి

బెంగళూర్: ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు వికె శశికళ(66) విడుదలకు అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి. అక్రమ సంపాదన కేసులో జైలు పాలైన ఆమె నాలుగేళ్ల శిక్ష పూర్తి కావడంతో బుధవారం అధికారికంగా విడుదలైనట్టేనని పరప్పన అగ్రహారం జైలు సూపరిండెంట్ వి.శేషమూర్తి తెలిపారు. వారం రోజుల క్రితం శశికళకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో విక్టోరియా ప్రభుత్వ హాస్పిటల్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. పరప్పన అగ్రహారం జైలు అధికారులు హాస్పిటల్‌కు వెళ్లి ఆమె విడుదలకు సంబంధించిన ఉత్తర్వులిచ్చారు.
ప్రస్తుతం కరోనా లక్షణాలు లేవని(అసింప్టమేటిక్), అయితే కొవిడ్ నిబంధనలమేరకు మరో మూడు రోజులపాటు హాస్పిటల్‌లో ఉండాలని వైద్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఉండగలిగితే ఆమెను జనవరి 30న డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. బుధవారం హాస్పిటల్‌లో ఉన్న శశికళను ఆమె మేనల్లుడు ఎంఎల్‌ఎ టిటివి దినకరన్ పరామర్శించారు. ఆ సందర్భంగా హాస్పిటల్ బయట ఆమె మద్దతుదారులు మిఠాయిలు పంచిపెట్టి నినాదాలు చేశారు.
Sasikala to be discharge from Hospital on January 30
Sasikala to be discharge from Hospital on January 30
related stories
-
జాతీయం Covid 19: మరో ఎంపీని మింగేసిన కరోనా... విషాదంలో బీజేపీ శ్రేణులు
-
తెలంగాణ తాజావార్తలు విశ్రాంత ఉపాధ్యాయురాలి శరీరదానం
-
హమారా హైదరాబాద్ కరోనా ఎంటరై నేటికి ఏడాది: గతేడాది మార్చి 2న రాష్ట్రంలో తొలి కేసు