హైదరాబాద్: శివధర్ రెడ్డి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని సివి ఆనంద్ తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.
పోలీస్ అకాడమీలో శివధర్ రెడ్డికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్ లో శివధర్ రెడ్డికి గౌరవవందనం, పదవీ విరమణ పొందిన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి ఆనంద్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని, ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సివి ఆనంద్ సూచించారు.

