షియోమీ 17 మ్యాక్స్, షియోమీ ఇయర్ క్లిప్ ఇయర్‌ఫోన్‌లతో పాటు షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్మార్ట్‌వాచ్ చైనాలో విడుదల అయింది. షియోమీ, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో కూడిన స్టాండర్డ్ ఎడిషన్‌తో పాటు, ఫ్లోరోరబ్బర్ స్ట్రాప్‌తో కూడిన షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో ప్రీమియం సిరామిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది.
ధర గురించి మాట్లాడితే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్టాండర్డ్ వెర్షన్ ధర CNY 399 (సుమారుగా రూ. 5,600). లెదర్ స్ట్రాప్ వేరియంట్ ధర CNY 449 (సుమారుగా రూ. 6,500). సెరామిక్ వేరియంట్ ధర CNY 479 (సుమారుగా రూ. 6,700). కాగా, ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, చెర్రీ బ్లాసమ్ పింక్, కోరల్ ఆరెంజ్, చీజ్ వైట్, సెరామిక్ వైట్, సిల్వర్ రంగులలో లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో షియోమీ హైపర్ఓఎస్ 3 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. 336×480 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 1.74-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం ఇది 2.5D టెంపర్డ్ గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఆరోగ్య పర్యవేక్షణ కోసం, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో డ్యూయల్-లైట్ PPD సెన్సార్‌ను అమర్చారు. ఇది 98.2 శాతం వరకు కచ్చితత్వంతో హృదయ స్పందన రేటును పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఇందులో ఉన్న ఇతర సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో బ్లూటూత్ 5.4, GNSS, NFC, BeiDou, GPS, GLONASS, Galileo, QZSS లకు మద్దతు ఇస్తుంది. ఈ వేరబుల్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. 400కి పైగా గేమ్‌ల కోసం స్టేటస్ ట్రాకింగ్‌కు మద్దతు ఇచ్చే కొత్త గేమ్ మోడ్ కూడా ఉంది.
షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో 350mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇది 90 నిమిషాల్లో జీరో నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని పేర్కొంది. ఈ వేరబుల్ ఒకే ఛార్జ్‌పై 21 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇది షియోమీ హెల్త్ యాప్‌తో పాటు, ఆండ్రాయిడ్ 8.0 లేదా ఆ తర్వాతి వెర్షన్, iOS 14.0 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో మెటల్ వెర్షన్ బరువు సుమారుగా 21.6 గ్రాములు కాగా, సెరామిక్ వేరియంట్ బరువు సుమారుగా 28.7 గ్రాములు. మెటల్ మోడల్ కొలతలు 42.84×32.16×9.7mm కాగా, సెరామిక్ వెర్షన్ కొలతలు 43.97×33.35×9.7mm.

