AI Photo
మన తెలంగాణ - హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు హైదరాబాద్ పాతబస్తీలో తృటిలో ప్రమాదం తప్పింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ ఎద్దు ఎదురుగా రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ఎద్దును పక్కకు తరలించడంతో ప్రమాదం తప్పింది. గాంధీభవన్ నుంచి రేస్‌కోర్స్‌లో నిర్వహించే సీఎం ట్రోఫీ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద కాన్వాయ్‌కు ఎదురుగా ఎద్దు రావడాన్ని గమనించిన మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంటనే రంగంలోకి దిగారు. ఎద్దును రోడ్డు పక్కకు లాగి వాహనాలకు మార్గం సుగమం చేశారు. మరోవైపు కాన్వాయ్‌లోని వాహనాలకు పోలీసులు బ్రేకులు వేయించి వేగాన్ని తగ్గించారు. ఎద్దును పక్కకు తరలించిన అనంతరం కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. ట్రాఫిక్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

