Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సింగ' చిత్రీకరణ 50 శాతం పూర్తి

'సింగ' చిత్రీకరణ 50 శాతం పూర్తి

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సింగ' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, గోపీచంద్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్ర బృందం కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్ సెట్స్‌ను నిర్మించి, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ షెడ్యూల్ కోసం మరింత భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా కలగలిపి దర్శకుడు వి. వెంకట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu