Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'స్వయంభు'లో 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్!

'స్వయంభు'లో 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్!

నిఖిల్ సిద్ధార్థ్ 'స్వయంభు' సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'స్వయంభు' కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు.

ఫైనల్ ప్రొడక్ట్‌లో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నిఖిల్ ఇంటెన్స్ వారియర్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించారు. త్వరలోనే 'స్వయంభు' రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu