Dailyhunt
తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. అధికారం కోసం కాంగ్రెస్ తో పొత్తు..!

తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. అధికారం కోసం కాంగ్రెస్ తో పొత్తు..!

మిళనాడులో నటుడు విజయ్ పార్టీ టివికె సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ౧౧౦కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

దీంతో విజయ్ అభిమానులు ఆయన ఇంటిముందు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, టివికె.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో టివికె పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. టివికె గెలుపు చాలా గర్వంగా ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అవుతానని చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒక్క శాతం కూడా విజయ్‌కి డౌట్‌లేదు. పొత్తులకు వెళ్లకుండా సింగిల్‌గా పోటీ చేశాడు. ఇది చారిత్రాత్మక విజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ మద్దతు కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu