Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Pakistani heavy rainfall

Pakistani heavy rainfall

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గురు, శుక్ర వారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండతో కలిపి మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు. ఈ భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు గురువారంలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో మంగళవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీట ర్లు వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని తల్లాడలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరోవైపు 27 జిల్లాలో 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు సైతం రికార్డయ్యాయి. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu