Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాయంతం ఆరు గంటల లోపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన విషయం విధితమే. యాదాద్రి భువనగిరి జిల్లా రెండో రోజుల క్రితం భారీ వర్షం కురవడంతో చెరువులు నిండుకుండలా మారాయి. ఒక్క వర్షం కురిస్తే చాలు చెరువులు అలుగు పోస్తాయని యాదాద్రి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu